తమిళ డైరెక్టర్స్ ఫ్లాప్ రన్ బ్రేక్ అవుతుందా ‘మురుగా’..?

AR-Murugadoss-Madharasi

తమిళ డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ లభిస్తుంది. అయితే, ఇటీవల కాలంలో తమిళ స్టార్ హీరోలు, దర్శకులు చేసిన సినిమాలు ఇక్కడ ఘోరంగా పరాజయం పాలవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు మరో తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సినిమాపై పడింది.

శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఏఆర్ మురుగదాస్‌కు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కానీ, ఆయన నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు ఆయన తెరకెక్కించిన ‘మదరాసి’ ఎలా ఉంటుందో అనే సందేహం తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది.

కేవలం మురుగదాస్ అనే కాదు, తమిళ దర్శకులు తెరకెక్కించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్‌గా నిలవడం కూడా దీనికి మరో కారణంగా చెప్పాలి. దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’, మణిరత్నం ‘థగ్ లైఫ్’ దారుణంగా ఫెయిల్ అవగా… లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’ కొంతవరకే వర్కవుట్ అయింది. ఇలా తమిళ దర్శకుల ఫ్లాప్ రన్‌ను మదరాసి చిత్రంతో మురగదాస్ ఏమైనా ఆపగలేడమో చూడాలి.

Exit mobile version