స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటి’ చిత్రం ఈ నెల 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు క్రిష్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఆయనతో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే, అనుష్క మాత్రం ఎక్కడా కనిపించలేదు.
దీంతో అనుష్క ఈ చిత్ర ప్రమోషన్స్ చేయదని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె కనిపించకున్నా, వినిపిస్తూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. రీసెంట్‌గా ఓ AI వీడియో ద్వారా ఆమె ఘాటి చిత్రాన్ని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రానా దగ్గుబాటితో అనుష్క చేసిన ఓ ఫోన్ కాల్ సంభాషణలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తుంది.
దీంతో పాటు ఓ రేడియో ఛానల్‌లో ఆమె అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యింది. ఇలా కనిపించకుండానే వినిపిస్తూ ఘాటి చిత్ర ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది అనుష్క.