పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయగా పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయింది. ఇక ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది.
ఈ క్రమంలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను అక్టోబర్ 1న సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేశారు.