పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి నిన్న వచ్చిన ట్రైలర్ తో మరింత హైప్ పెంచుకుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
కానీ తమిళ్ వెర్షన్ మాత్రం జనవరి 10 అంటూ లాక్ చేశారు. అయితే అదే డేట్ లో కోలీవుడ్ బిగ్ స్టార్ విజయ్ జన నాయగన్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో తమిళ నాట రిలీజ్ సాఫీగా ఉండేందుకు రాజా సాబ్ ఒక రోజు వెనక్కి వెళ్ళాడు. మరి జన నాయగన్ తెలుగులో కూడా జన నాయకుడు పేరిట జనవరి 9 డేట్ కి లాక్ అయ్యింది.
మరి ఎలాగైతే రాజా సాబ్ యూనిట్ ఒక రోజు తమిళ నాట రిలీజ్ ని వెనక్కి వేసుకున్నారో అదే విధంగా జన నాయకుడు కూడా తెలుగు స్టేట్స్ లో ఒకరోజు వెనక్కి వెళ్తాడో లేదో అనేది ఆసక్తిగా మారింది. మరి వీరు కూడా తెలుగులో ఓ రోజు వెనక్కి వెళితే ఏ సినిమాకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.