ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా ఉంది అంటే అది వెంకీ మామ నటించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” అని చెప్పాలి. ఇక ఈ చిత్రం తర్వాత వెంకీ మామకి తదుపరి ప్రాజెక్ట్ పెద్ద సవాలుగా మారింది. ఈ సమయంలో ఎవరితో సినిమా అనే మాటకి సమాధానంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది.
మరి నేడు మేకర్స్ అఫీషియల్ అనౌన్సమెంట్ ని ఇచ్చేసారు. ఇది వరకు వెంకీ మామ సినిమాలకి రచయితగా వర్క్ చేసిన త్రివిక్రమ్ మొదటిసారి తనకి దర్శకత్వం వహించనున్నారు. దీనితో ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్ గా మారింది. ఇక నేడు ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా కార్యక్రమంలో నిర్మాత చినబాబు, నాగవంశీ అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబులు హాజరయ్యారు. అలాగే షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.