మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఘాటీ”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇది వరకే పలు డేట్స్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఈ జూలై 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా అనుమానమే అంటూ పలు రూమర్స్ రీసెంట్ గానే వచ్చాయి. ఇక అనుకున్నట్టే ఇప్పుడు జరిగింది.
సినిమా మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారిక క్లారిటీ అందించారు. ఒక అధికారిక ప్రెస్ నోట్ తో ఘాటీ సినిమా తమకి ఒక ఎమోషన్ అని ఈ సినిమా నుంచి ప్రతీ చిన్న విషయం అంతా చిరకాలం గుర్తుండేలానే డిజైన్ చేస్తున్నామని అలాగే కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అయితే సినిమా వి ఎఫ్ ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్లే ఈ వాయిదా అన్నట్టు తెలుస్తుంది. మరి కొత్త ఎప్పుడు అనేది వేచి చూడాలి. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Team #GHAATI pic.twitter.com/UhUtWuMR6g
— UV Creations (@UV_Creations) July 5, 2025