జరుగుతున్నవన్నీ చూస్తుంటే హార్ట్ ఎటాక్ హీరొయిన్ అదా శర్మకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉందనే చెప్పుకోవాలి. సినిమాలో తన నటనతో ఈ ముంబై ముద్దుగుమ్మ ప్రేక్షకులను స్పందిమ్పజేసింది. ఇప్పుడు అదా నటించిన హిందీ సినిమా ‘హాసీ తో ఫాసీ’ కి కూడా మంచి స్పందనే వస్తుంది
ఈ సినిమాలో పరినీతి చోప్రా హీరోయిన్ పాత్ర పోషిస్తే అదా శర్మ సప్పోర్టింగ్ రోల్ లో నటించింది. ఆమె నటించిన పాత్రలకు గుర్తింపు దక్కడమే కాక ఆమెకు ఆఫర్లు వెల్లివిరుస్తున్నాయి. టాలీవుడ్ లో సైతం మరికొన్నాళ్ళలో బిజీ తారగా మారినా ఆశ్చర్యపడనవసరం లేదు