ఇంటర్వ్యూ : నటి మాళవిక మనోజ్ – ‘ఓ భామ అయ్యో రామ’లో సత్యభామ పాత్ర అందరినీ అలరిస్తుంది!

ఇంటర్వ్యూ : నటి మాళవిక మనోజ్ – ‘ఓ భామ అయ్యో రామ’లో సత్యభామ పాత్ర అందరినీ అలరిస్తుంది!

Published on Jul 7, 2025 8:00 PM IST

సుహాస్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో ‘జో’ అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.

‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

నేను తమిళంలో నటించిన చిత్రం ‘జో’లో నా అభినయం చూసి దర్శకుడు రామ్‌ ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకున్నాడు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది.

స్టోరీలో మీకు నచ్చిన అంశాలేమిటి..?

అది సింగిల్‌లైన్‌లో చెప్పలేను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్‌ సింపుల్‌ గర్ల్‌గా చేశాను. ఈ సినిమలో నా పాత్ర ఎంతో మోడ్రన్‌గా, హైపర్‌గా, అటిట్యూడ్‌తో ఉంటుంది. ప్రతి నటికి కావాలసిన వైవిధ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రంలో సత్యభామ అనే పాత్రలో కనిపించాను.

ఈ పాత్ర కోసం ఏమైనా హోమ్‌ వర్క్‌ చేశారా..?

ఈ సినిమా కోసం ఎలాంటి వర్క్‌ పాప్‌, హోంవర్క్‌ చేయలేదు. నా రియల్‌లైఫ్‌కు ఎలాంటి కంపారిజిన్‌ లేని పాత్ర సత్యభామ పాత్ర. నాకు తెలుగు రాకపోయినా.. దాని భావం అర్థం చేసుకుని నటించాను.

తెలుగులో నటించడం ఎలా అనిపించింది..?

చాలా హ్యపీగా అనిపించింది. తెలుగు టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌లలో ఎంతో ప్రొఫెజనలిజం ఉంది. ఎంతో కంఫర్టబుల్‌గా నటించాను. లాంగ్వేజ్‌ తప్ప నాకు తెలుగులో ఎలాంటి ప్రాబ్లమ్‌ అనిపించలేదు. అన్ని లాంగ్వేజ్‌ల మాదిరిగా నాకు ఇక్కడ కూడా కంఫర్టబుల్‌గా అనిపించింది.

ఛాలెంజింగ్‌ రోల్స్‌ ఏమైనా చేయాలని ఉందా..?

నాకు ఎప్పుడూ, డిఫరెంట్‌గా ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలని ఉంటుంది. ప్రతి సినిమాలో రొటిన్‌ పాత్రలు చేస్తే నాకే కాదు ఆడియన్స్‌కు కూడా బోర్‌ కొడుతుంది. నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం.

సుహాస్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌..?

వెరీ నైస్‌ పర్సన్‌. ఎంతో హార్డ్‌వర్క్‌ చేస్తాడు. సినిమా సెట్‌లో సినిమా కోసం మాత్రమే మాట్లాడతాడు. పెద్ద టాకింగ్‌ పర్సన్‌ కాదు.

మీ ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి?

సినిమా నేపథ్యంతో సంబంధం లేని ఫ్యామిలీ నాది. ఫ్యామిలీ సపోర్ట్‌తోనే నటిస్తున్నాను. కానీ అందరూ బంధువులు మొదట్లో భయపడ్డారు. నాకు మాత్రం ఎలాంటి భయం లేదు. సినిమాల్లో నటించడం గర్వంగా ఉంది. ఇప్పుడు ట్రైలర్‌ చూసి మా ఫ్యామిలీ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు.

నిర్మాత హరీష్‌ గురించి..?

నిర్మాత ఎంతో నైస్‌ పర్సన్‌. సినిమాకు ఎంత కావాలో చాలా రిచ్‌గా ఖర్చు పెట్టాడు. సినిమా అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు