ఆర్.ఎస్.సీలో ఎన్.టి.ఆర్ పెళ్లి సీన్స్

ఆర్.ఎస్.సీలో ఎన్.టి.ఆర్ పెళ్లి సీన్స్

Published on Jul 16, 2013 8:40 AM IST

Ramaiya-Vastavaiya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హారీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ రోజు నుంచి సియర్రా మరియు ఫ్రెండ్లీ లైన్ ఏరియాల్లో కొన్ని పెళ్లి సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ షూటింగ్ లో ఎన్.టి.ఆర్- సమంత పాల్గొంటున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా ఆడియో ఆగష్టు మధ్యలో విడుదల చేయనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేతున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు