రామయ్యా వస్తావయ్యా ఓవర్సీస్ ప్రింట్స్ స్టేటస్

రామయ్యా వస్తావయ్యా ఓవర్సీస్ ప్రింట్స్ స్టేటస్

Published on Oct 8, 2013 6:08 PM IST

Ramayya_Vasthavayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకి సంబదించిన ప్రింట్స్ (డిజిటల్ మరియు సాధారణ ప్రింట్స్)ని చాలా త్వరగా అన్ని ఓవర్సీస్ ఏరియాలకు పంపించేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం..

అమెరికా – 85 డిజిటల్ ప్రింట్స్ ఈ రోజు సాయంత్రం 9:30 నిమిషాలకు వెళ్లనున్న ఎమిరేట్స్ ఫ్లైట్ లో వెళ్లనున్నాయి. అలాగే ‘దుబాయ్‘, ‘ఆస్ట్రేలియా‘, ‘యుకె‘ కి వెళ్ళాల్సిన ప్రింట్స్ కూడా రేపు ఉదయం వెళ్లనున్నాయి.

ఆస్ట్రేలియా కి 6 డిజిటల్ ప్రింట్స్, 1 సాధారణ ప్రింట్ వెళుతోంది. యుకెకి 14 డిజిటల్ ప్రింట్స్, 1 సాధారణ ప్రింట్ వెళుతోంది. దుబాయ్ కి 10 సాధారణ ప్రింట్స్ వెళ్తున్నాయి. అలాగే సింగపూర్ కి కూడా 2 డిజిటల్ ప్రింట్స్ వెళ్తున్నాయి.

ఇక ఆఫ్రికా ఖండంలోకి వస్తే ‘సౌత్ ఆఫ్రికా‘ కి 2 డిజిటల్ ప్రింట్స్ వెళ్లనున్నాయి. నైజీరియా మరియు టాంజానియాలకు చెరొక డిజిటల్ ప్రింట్ వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు