ఒకరోజు ముందుగానే రానున్న రామయ్యా వస్తావయ్యా

RV


అప్డేట్ :

నిన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమా అక్టోబర్ 11న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారాని నిన్ననే తెలిపాము. తాజాగా ఈ మూవీ ని అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఈ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ తెలియజేశాడు.

‘యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి శుభవార్త. దిల్ రాజు గారు రామయ్యా వస్తావయ్యాని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నామని ఖరారు చేసారు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేస్తామని’ హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తాము.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువభాగం అక్టోబర్ 11న థియేటర్స్ లోకి రానుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒక్కరోజు షూట్ చేయాల్సిన ప్యాచ్ వర్క్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఎన్.టి.ఆర్ – సమంత జంటగా కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ని దిల్ రాజు నిర్మించాడు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియోని త్వరలోనే చాలా సింపుల్ గా రిలీజ్ చేయనున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. అలాగే హై వోల్టేజ్ ఎంటర్టైనర్స్ తీయడంలో హరీష్ శంకర్ మంచి పేరు ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version