ఫ్యాన్స్ ని ఫిదా చేసిన ఎన్.టి.ఆర్ పంచ్ డైలాగ్

ఫ్యాన్స్ ని ఫిదా చేసిన ఎన్.టి.ఆర్ పంచ్ డైలాగ్

Published on May 20, 2013 3:35 PM IST

Ramayya-Vasthavayya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలై సూపర్బ్ రెస్పాన్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొత్త లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. ఈ ట్రైలర్ లో ఫ్యాన్స్ కోసం ఒక పంచ్ డైలాగ్ కూడా విడుదల చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది ఎన్.టి.ఆర్ ని బుడ్డోడు అని అంటుంటారు. ఇప్పుడు ఇదే పదాన్ని ఆధారంగా చేసుకొని ఎన్.టి.ఆర్ ఈ డైలాగ్ చెప్పినట్టున్నాడు. ‘బుడ్డోడు బుడ్డోడు అంటే బట్టలు ఊడదీసి కొడతాను. అలా పిలవాలంటే ఒక అర్హత అయినా ఉండాలి లేదా నా అభిమానైనా అయివుండాలి’. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ కి మంచి పంచ్ డైలాగ్స్ రాయగలరని మనకు తెలుసు. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో చాలా ఉండవచ్చునని ఆశించవచ్చు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ అతిధి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు