విజయ దశమి రోజున ఎన్టీఆర్ కొత్త సినిమాకి ముహూర్తం


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘బాద్షా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, మరో కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడు. ఇటీవలే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి విజయ దశమి రోజున ముహూర్తం నిర్ణయించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకి ఎమ్.ఎల్.ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అని వార్తలొచ్చాయి. హరీష్ శంకర్ ఈ సినిమాకి ఎమ్.ఎల్.ఎ అనే టైటిల్ కాదని ధ్రువీకరించారు. ఈ సినిమాలో రాజకీయ అంశాలకు తావివ్వకుండా పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని దిల్ రాజు చెబుతున్నారు. ఈ సినిమాలో హీరొయిన్ ఎవరనేది మిగతా పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియజేయనున్నారు.

Exit mobile version