యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ -‘కందిరీగ’ ఫేం శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మరి కొద్ది రోజులు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం పొల్లాచ్చి వెళ్లనుంది.
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు. ‘కందిరీగ’ తో హిట్ కొట్టిన శ్రీనివాస్ ఈ సినిమాతో కూడా మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోనున్నాడు. బెల్లంకొండ సురేష్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు.