కన్నడలో బృందావనం రీమేక్

కన్నడలో బృందావనం రీమేక్

Published on Dec 19, 2012 11:37 PM IST

brindavanam
ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన “బృందావనం” చిత్రం కన్నడలో రీమేక్ చేస్తున్నారు. కాజల్ మరియు సమంత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రెండేళ్ళ క్రితం విడుదల అయిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. విజయ్ కాంత్ తన కొడుకుతో తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారని పుకార్లు వచ్చాయి కాని ఆ చిత్రం మొదలు కాలేదు. ప్రస్తుతం కన్నడలో దర్శన్ ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యనున్నారు. ఈ చిత్రం 2013 ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో “బాద్షా” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మరోసారి ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ చిత్రం కాకుండా త్వరలో ఎన్టీఆర్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కే చిత్రం చిత్రీకరణలో పాల్గొంటారు. అంతే కాకుండా సంతోష్ శివన్ చిత్రానికి సంతకం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు