తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాద్షా’ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఇటలీ మరియు స్విట్జర్లాండ్ లో జరుపుకుంది. ఈ చిత్ర రెండవ షెడ్యూల్ మలేషియాలో జరగనుంది. ఈ విషయాన్ని ‘బాద్షా’ రచయితలలో ఒకరయిన కోనా వెంకట్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ సరికొత్త లుక్ తో కనపడనున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఎన్.టి.ఆర్ సరసన రెండవసారి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడి ఎంటర్టైనర్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.