పిక్ టాక్: దేవరకొండ కోసం ‘దేవర’

పిక్ టాక్: దేవరకొండ కోసం ‘దేవర’

Published on Feb 11, 2025 2:00 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీగా VD12 నిలిచింది. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌ని రూల్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్‌తో సాలిడ్ అప్డేట్‌ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

VD12 టైటిల్ టీజర్‌ను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ టైటిల్ టీజర్‌కు వివిధ భాషల్లో వివిధ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళ టీజర్‌కు సూర్య, హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక తాజాగా తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ‘దేవర’ సిద్ధమయ్యాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ఈ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో హీరో విజయ్ దేవరకొండ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దేవరకొండ కోసం దేవర వచ్చాడంటూ అభిమానులు ఈ ఫోటోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు