యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎట్టకేలకు ఓ సినిమా రానుంది. అభిమానులు, మూవీ లవర్స్ ఈ కాంబినేషన్ కోసం చాలా కాలం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఈ సంవత్సరం మొదలవ్వాలి కానీ అలా జరగడం లేదు. కానీ వీరిద్దరూ వచ్చే ఏడాది ఓ సినిమా కోసం ఒకటవుతున్నారు. 2014 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటార్ మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అలాగే అతను ఇంకొన్ని క్రేజీ సినిమాలు చేయనున్నాడు.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అది పూర్తి కాగానే రభస సెట్స్ లోకి అడుగుపెడతాడు. అలాగే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ”అత్తారింటికి దారేది” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.