మరొక స్టైల్ తో ఆశ్చర్యపరచనున్న ఎన్.టి.ఆర్

మరొక స్టైల్ తో ఆశ్చర్యపరచనున్న ఎన్.టి.ఆర్

Published on Jan 14, 2013 8:56 AM IST

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ ఫస్ట్ లుక్ తో అందరినీ ఆశ్చర్య పరిచారు. తాజాగా నిన్న విడుదల చేసిన స్టిల్స్ లో సరికొత్త హెయిర్ స్టైల్, డ్రెస్ కోడ్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. నిన్న విడుదల చేసిన ఫోటోలతో పాటు ‘బాద్షా’ టీం మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. కొత్త ఫోటోలలో ఎన్.టి.ఆర్ హెయిర్ స్టైల్, డ్రెస్ చాలా వైవిధ్యంగా ఉన్నాయి. మెడలో తాయెత్తు, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ చూస్తేనే అది మాస్ పాత్ర అని అర్థమయిపోతోంది.

ఈ ఫోటో మనకు స్టొరీ గురించి ఒక హింట్ ఇస్తోంది? చూస్తుంటే ఈ సినిమాలో భారీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా? లేక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ది రెండవ పాత్ర ఉందా? అనే ఆసక్తికరమైన విషయాన్ని చెప్పకనే చెప్పారు. కానీ అసలు కథ ఏందీ అని తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీను వైట్ల డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు