ఎన్టీఆర్ పులి ఫైట్ కోసం అంత రిస్క్ చేశాడా..!

ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ నుండి బయటికి వస్తున్న ప్రతి విషయం సంచలనంగా మారుతుంది. బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టార్ పై అంచనాలు మాములుగా లేవు. ఇక ఈ చిత్రం బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ని కూడా దాటివేసి అప్పుడే రికార్డ్స్ వేట మొదలుపెట్టింది. కాగా ఈ మూవీ గురించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా ఆయనకు ఈ చిత్రంలో పులితో పోరాడే సన్నివేశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో లీక్ కావడం జరిగింది. బేర్ బాడీ తో పులితో వీరోచితంగా పోరాడుతున్న ఎన్టీఆర్ లుక్ అంచనాలు తారాస్థాయికి చేర్చింది.

ఐతే ఈ ఫైట్ కోసం ఎన్టీఆర్ చాలా రిస్క్ చేశారట. రాజమౌళి నిజమైన పులిని ఈ సన్నివేశం కోసం వాడారట. పులి తో క్లోజ్ ఫైట్ సన్నివేశాలను గ్రాఫిక్ చేయనున్న రాజమౌళి, ఎదురుపడే సన్నివేశాలలో నిజమైన పులిని ఉపయోగించారట. నిపుణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బంధించబడిన పులితో చాల దగ్గరా రిస్కీ షాట్స్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. పది నిమిషాలకు పైగా ఉండే ఈ సన్నివేశం గూస్ బంప్స్ కలిగించేలా ఉంటుందట. బాహుబలి సినిమాలో రాజమౌళి పెద్ద అడవి దున్నపోతుతో రానా కు ఓ పోరాట సన్నివేశం పెట్టగా అది అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ సన్నివేశం అంతకు మించి ఉంటుందని సమాచారం.

Exit mobile version