చైతన్య దంతులూరి తీస్తున్న ‘బసంతి’ సినిమా ప్రచారానికి డోకా లేకుండా చుస్కుంటున్నాడు. బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా కొత్త భామ ఆలీషా భాగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చైతన్యనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు
ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే మహేష్ బాబు ‘ఆగడు’ సెట్ లో తమన్నా తో కలిసి విడుదలచేసాడు. ఇప్పుడు ఈ సినిమాలో ‘ప్రతీక్షణం’ పాటను ఎన్.టీ.ఆర్ స్వయంగా విడుదలచేశారు. దర్శకుడు ఈ సినిమా ప్రేక్షకుల నోళ్ళలో వుండాలని తనవంతు కృషి చేస్తున్నట్లు అర్ధమవుతుంది.
రొమాంటిక్ యాంగిల్ ను టెర్రరిజంతో జతకలిపిన కధాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతం ప్రధానఆకర్షణగా నిలవనుంది. ఆడియో విడుదలవివరాలు త్వరలోనే ప్రకటిస్తారు