రాజమౌళిని గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.!

రాజమౌళిని గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.!

Published on Oct 10, 2020 8:03 AM IST

ఈరోజు దర్శక ధీరుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు సహా ఆయన అభిమానులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే జక్కన్న ఇప్పుడు జక్కన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ ను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎప్పటి నుంచో ఈ చిత్రం నుంచి తారక్ తాలూకా ఫస్ట్ లుక్ మరియు టీజర్లు మోస్ట్ అవైటెడ్ గా నిలిచాయి. అయితే వీటి విషయంలో తారక్ ఫ్యాన్స్ జక్కన్నను ఒక డిమాండ్ చేస్తున్నారు. తారక్ పై టీజర్ అండ్ ఫస్ట్ లుక్ ను “రామరాజు ఫర్ భీం”గా చరణ్ వాటిని రివీల్ చెయ్యనున్నారు. కానీ ఇప్పటివరకు తారక్ నటించిన అన్ని చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను హ్యాండిల్స్ నుంచే రిలీజ్ చెయ్యబడ్డాయని..

అదే సెంటిమెంట్ ను రాజమౌళి కూడా కొనసాగించాలని అడుగుతున్నారు. టీజర్ ను చరణ్ హ్యాండిల్ నుంచి విడుదల చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాత్రం తారక్ హ్యాండిల్ నుంచి విడుదల చేయించమని రాజమౌళిని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు చేస్తున్నారంటే ఇప్పుడు ఈ విషయం పైనే కొమరం భీం ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.

తాజా వార్తలు