వారిద్దరి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు-ఎన్టీఆర్

వారిద్దరి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు-ఎన్టీఆర్

Published on Apr 30, 2020 10:42 AM IST

రెండు రోజుల వ్యవధిలో బాలీవుడ్ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ని కోల్పోయింది. నిన్న బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి ఎదిగిన వర్సిటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణించగా నేడు సీనియర్ హీరో మరియు గొప్ప నటుడు రిషి కపూర్ మరణించడం జరిగింది. వీరిద్దరూ కూడా క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం

జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా వీరి అకాల మరణాలకు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్వల్ప వ్యవధిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఇండియన్ సినిమాకు తీరని లోటని అన్నారు. వారిద్దరి మరణం కలచి వేసిందన్న ఎన్టీఆర్ వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

తాజా వార్తలు