ఎన్టీఆర్ వరుసగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. రాజమౌళి తో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఆయన తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఇక ఈ మూవీ కథపై ఇప్పటికే అనేక పుకార్లు పరిశ్రమలో చక్కర్లు కొడుతుండగా అధికారిక ప్రకటనలు ఐతే ఏమి లేవు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని స్టైలిష్ బిజినెస్ టైకూన్ లా చుపిస్తాడనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది.
కాగా త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఇదే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ కూడా బన్నీతో పాన్ ఇండియా ప్రకటించేశారు. మరియు ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత విడుదల కానుంది. కాబట్టి త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ ఎన్టీఆర్ తోనే అని గట్టిగా వినిపిస్తుంది. ఐతే ఇది ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ పై ఆధారపడి ఉంటుందని సమాచారం. ఏదిఏమైనా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తన పాన్ ఇండియా ఎంట్రీ షురూ చేయనున్నాడట.