“ఆదిపురుష్”లో ఈ హీరోయిన్ ను ఫిక్స్ చేసేశారా?

“ఆదిపురుష్”లో ఈ హీరోయిన్ ను ఫిక్స్ చేసేశారా?

Published on Sep 5, 2020 8:00 AM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో తీస్తున్న ”ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ పీరియాడిక్ వండర్ కోసం ఇపుడు చాలా మందే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు ఎప్పటికప్పుడు సరైన అప్డేట్స్ ఇస్తూ ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. అలా ఇటీవలే ఈ చిత్రాల్లో రావణునిగా సైఫ్ ను పరిచయం చేసేసారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మిగతా విషయాల్లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రెండో రోజు నుంచే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశానికి సంబంధించి బజ్ మొదలయ్యింది. అయితే మొదట సీత పాత్రలో కీర్తీ సురేష్ పేరు వినిపించినా ఆ తర్వాత మళ్ళీ కియారా అద్వాని పేరు గట్టిగా వినిపించింది.

అయితే ఈ ఇద్దరిలో మాత్రం ఓం రౌత్ కియారానే హీరోయిన్ గా ఫిక్స్ చెయ్యాలని అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈమెకు ఇప్పటికే కథను కూడా వినిపించగా ఆమె ఇంప్రెస్ అయ్యిందట. మరి ఏది ఏమైనప్పటికీ అసలు విషయం ఏమిటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు