కరోనాపై పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ నిర్మాత మరియు వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్ ఈరోజు ఉదయం టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె.టి.ఆర్ ను కలిసి రూ.25 లక్షల విరాళం అందించారు.
అలాగే ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా ప్రభావంపై మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్పంచించాలి అని తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం ఇది విశ్వ ప్రసాద్ తెలిపారు. అందుకే కరోనా సహాయక చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించామని తెలియజేసారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా మహమ్మారివల్ల భయాందోళనలో ఉంది.
కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్మూలనకు కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నాయి.ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్(కోవిడ్ 19) కారణంగా అంతర్జాతీయ విపత్తు ఏర్పడింది.
దీనిని నివారించడం మన బాధ్యత. అందుకు తీసుకుంటున్న నివారణా చర్యలకు మన వంతు సహకారాన్ని అందించాలి. అందులో భాగంగా. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ లో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండని ఆకాంక్షించారు.