‘మాస్టర్’ కోసం డబ్బింగ్ చెప్పిన ‘రవీనా’ !

‘మాస్టర్’ కోసం డబ్బింగ్ చెప్పిన ‘రవీనా’ !

Published on Apr 14, 2020 11:00 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది దాంతో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది.

కాగా ఇప్పటికే మాస్టర్ మూవీ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. అయితే తాజా అప్ డేట్ ఏమిటంటే, ప్రముఖ తమిళ నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా ఈ చిత్రంలో మాళవిక పాత్రకు డబ్బింగ్ చెప్పంది.

ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఐతే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపిస్తారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు