సందీప్ కాదు ఈ మోస్ట్ వైలెంట్ దర్శకునితో గ్లోబల్ స్టార్!?

సందీప్ కాదు ఈ మోస్ట్ వైలెంట్ దర్శకునితో గ్లోబల్ స్టార్!?

Published on Jun 13, 2025 8:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు కలయికలో చేస్తున్న భారీ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ తర్వాత సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ తో తన 17వ సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటో అనేది సస్పెన్స్ గా మారింది.

అయితే ఈ లైనప్ లో మన టాలీవుడ్ వైలెంట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఉండొచ్చు అనే టాక్ ఉంది. కానీ సందీప్ తో ఏమో కానీ బాలీవుడ్ మోస్ట్ వైలెంట్ సినిమా “కిల్”ని తెరకెక్కించిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో రామ్ చరణ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది వరకు కూడా వీరి కలయికపై టాక్ వచ్చింది కానీ అప్పుడు ఆ రూమర్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఉందనే వినిపిస్తుంది. ఇది నిజం అయితే వీరు ఎలాంటి సినిమాతో వస్తారో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు