కొద్దిరోజుల విరామం తరువాత ఇషా చావ్లా తిరిగి చిత్రీకరణలో పాల్గొంటుంది చివరగా “శ్రీమన్నారాయణ” చిత్రంలో కనిపించిన ఈ భామ తరువాత “తను వెడ్స్ మను” రీమేక్ అయిన “రాధా కృష్ణులు” చిత్రీకరణలో పాల్గొనలేదు.ఈ మధ్యలో తను జబ్బుపడింది అని ఒక ప్రముఖ పత్రిక ప్రకటించింది. ఎట్టకేలకు ఆమె అసలు కారణం చెప్పింది. ఎడతెరపి లేని చిత్రీకరణలో పాల్గొనడం మూలాన తను అనారోగ్యం పాలయ్యింది అని ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చింది అని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. “శ్రీమన్నారాయణ” , “రాధాకృష్ణులు” మరియు కన్నడ చిత్రం “విరాట్” ల కోసం ఈమె రాజమండ్రి, స్విట్జర్లాండ్ మరియు పోల్లచికి చిత్రీకరణ కోసం వెళ్ళారు. “రాధా కృష్ణులు” చిత్రానికి దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా సునీల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కనగన రనౌత్ పాత్రలో ఈశ చావ్లా కనిపించనుంది.