జీవితపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్

జీవితపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్

Published on Oct 7, 2013 1:33 PM IST

jeevitha-rajasek-(1)

ఈ రోజు నాంపల్లి కోర్టు నటి, నిర్మాత అయిన జీవితా రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఫైనాన్సియర్ పరంధామ రెడ్డి కేసు పెద్దదం వల్ల అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

కొద్ది రోజుల క్రితం జీవిత పరందామ రెడ్డికి ఇచ్చిన 36 లక్షల చెక్ బౌన్స్ అవ్వడంతో ఫైనాన్సియర్ లీగల్ గా యాక్షన్ తీసుకున్నాడు. రెండు సార్లు జీవిత కోర్టుకి హాజరు కాకపోవడంతో ఈ నెల 29 లోపు జీవిత, రాజశేఖర్ ని కోర్టుకు హాజరు పరచాలని జూబ్లీ హిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై జీవిత, రాజశేఖర్ ఇంకా ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు.

తాజా వార్తలు