ఈ ఏడాదిలో టాలీవుడ్ పరిస్థితి చాలా డిజప్పాయింటింగ్ గానే సాగింది అని చెప్పాలి. ఒక్క సంక్రాంతి సీజన్ తప్పితే అక్కడ నుంచి ఈ వేసవి ముగిసేవరకు సరైన సినిమాలు పడలేదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. అయితే మార్చ్, మే, జూన్ వరకు భారీ సినిమాలు హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి సినిమాలు లాక్ అవ్వడం వాయిదా పడటం ఇదే ప్రాసెస్ లా మారిపోయింది.
ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పైనే కింగ్డమ్ పరిస్థితి ఆధారపడింది అన్నట్టుగా కూడా పరిస్థితులు కనిపించాయి. వీరమల్లు రాదు కింగ్డమ్ ని రానివ్వదు అనేట్టుగా ఉంది అనే దగ్గర నుంచి ఇప్పుడు ఈ రెండు సినిమాలకే బాక్సాఫీస్ దగ్గర క్లాష్ తప్పడం లేదు అనే దగ్గరకి పరిస్థితులు మారాయి.
అయితే ఇది వరకు పవన్ సినిమా వస్తే విజయ్ కింగ్డమ్ మినిమమ్ వారాల నుంచి నెల మేర వెనక్కి వెళ్ళేది కానీ ఇపుడు కేవలం ఒక్క రోజు తేడా తోనే రెండు సినిమాలు కూడా రావాల్సి ఉందట. ఇందుకు మరోదారి మేకర్స్ ముందు కూడా లేదట. మరి దీనికి కారణం ఓటిటిల డీల్ అనే వినిపిస్తుంది.
హరిహర వీరమల్లు సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంటే కింగ్డమ్ ని నెట్ ఫ్లిక్స్ సాలిడ్ ధరలు ఇచ్చి సొంతం చేసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా జూలై 24, 25 తేదీల్లో మాత్రమే విడుదల చెయ్యాల్సిందే అని ఓటిటిలు పట్టుబట్టాయట. తమతో జరిగిన ఒప్పందాలు మేర వాటిని దాటే రెండు సినిమాలు కూడా చాలా సార్లు వాయిదా పడ్డాయట.
కానీ ఇప్పుడు మొత్తం తిరిగి చూస్తే ఈ రెండు డేట్స్ లోనే రెండు సినిమాలు రావాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. సో హరిహర వీరమల్లు కి జూలై 24 కింగ్డమ్ కి జూలై 25 డేట్స్ లాక్ అయ్యినట్టుగా వినిపిస్తోంది. ఇక వీటిపై అధికారిక క్లారిటీ రేపు రానున్నాయట. సో ఒక ఊహించని క్లాష్ ఇప్పుడు మేకర్స్ వద్దనుకున్నా కూడా తప్పడం లేదని చెప్పక తప్పదు.