మహిళల T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల
ఇంగ్లండ్‌లో జూన్ 12 నుండి జూలై 5, 2026 వరకు జరగనున్న మహిళల T20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ మొత్తం 24 రోజుల పాటు సాగనుంది.
గ్రూపులు మరియు ముఖ్యమైన మ్యాచ్‌లు
ఈసారి 12 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు రెండు క్వాలిఫైయర్ జట్లు ఉంటాయి. గ్రూప్ 2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక మరియు రెండు క్వాలిఫైయర్ జట్లు ఉంటాయి.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతుంది, ఇది అభిమానుల కోసం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
టోర్నమెంట్ వేదికలు
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ జూన్ 12న ఇంగ్లండ్ మరియు శ్రీలంక మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. మొత్తం మ్యాచ్‌లు ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రాఫోర్డ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వంటి వివిధ స్టేడియాల్లో జరుగుతాయి.
నాకౌట్ రౌండ్లు లండన్‌లో జరుగుతాయి. రెండు సెమీఫైనల్స్ ది ఓవల్ మైదానం లో, ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది.
పూర్తి షెడ్యూల్:
జూన్ 12: ఇంగ్లండ్ vs శ్రీలంక, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 13: క్వాలిఫయర్ vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రాఫోర్డ్; ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, ఓల్డ్ ట్రాఫోర్డ్; వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్
జూన్ 14: క్వాలిఫయర్ vs క్వాలిఫయర్, ఎడ్జ్‌బాస్టన్;
జూన్ 14: భారత్ vs పాకిస్థాన్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 16: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్; ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్
జూన్ 17: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హెడింగ్లీ; భారత్ vs క్వాలిఫయర్, హెడింగ్లీ; దక్షిణాఫ్రికా vs పాకిస్థాన్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 18: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, హెడింగ్లీ
జూన్ 19: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్
జూన్ 20: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్; పాకిస్థాన్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్; ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హెడింగ్లీ
జూన్ 21: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్; దక్షిణాఫ్రికా vs భారత్, ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 23: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్; శ్రీలంక vs క్వాలిఫయర్, బ్రిస్టల్; ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, హెడింగ్లీ
జూన్ 24: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, లార్డ్స్
జూన్ 25: భారత్ vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రాఫోర్డ్; దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్, బ్రిస్టల్
జూన్ 26: శ్రీలంక vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రాఫోర్డ్
జూన్ 27: పాకిస్థాన్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్; వెస్టిండీస్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్; ఇంగ్లండ్ vs న్యూజిలాండ్, ది ఓవల్
జూన్ 28: దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్, లార్డ్స్; ఆస్ట్రేలియా vs భారత్, లార్డ్స్
జూన్ 30: సెమీఫైనల్ 1, ది ఓవల్
జూలై 2: సెమీఫైనల్ 2, ది ఓవల్
జూలై 5: ఫైనల్, లార్డ్స్