అవైటెడ్ ‘కూలీ’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

అవైటెడ్ ‘కూలీ’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

Published on Jun 18, 2025 10:06 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున సాలిడ్ రోల్ లో ఉపేంద్ర ఇంకా తదితర టాలెంటెడ్ స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెద్క్ చిత్రమే “కూలీ”. తమిళ్ సహా తెలుగులో కూడా భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి ఇక వరుస అప్డేట్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ముందు సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన మొదటి సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సాంగ్ పై ఫైనల్ గా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. కోలీవుడ్ వర్గాల్లో అయితే ఈ పాట ఈ వారంలోనే విడుదల అవుతుంది అని టాక్. ఇక దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది అని వీకెండ్ కి అలా సాంగ్ ఉండొచ్చని వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించగా ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు