సినిమా టికెట్ పై వాట్ రద్దు

సినిమా టికెట్ పై వాట్ రద్దు

Published on Dec 18, 2012 12:50 PM IST

vat
సినిమా టికెట్స్ మీద కూడా వాట్ (వాల్యూ యాడెడ్ టాక్స్) విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకొని మళ్లీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఒకవేళ వాట్ విధిస్తే చాలా మంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. టికెట్ ధర పెంచాలని ఇటీవల కొందరు నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని కూడా వేసింది. వారు అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకోనున్న సమయంలో దాసరి నారాయణ రావు వాట్ ఎత్తివేసే విధంగా ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో మంది నిర్మాతల మీద భారం పడకుండా కాపాడిన దాసరి నారాయణ రావు గారికి కృతజ్ఞతలు అని నిర్మాత నత్తి కుమార్ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు