అనుష్కపై అసలా రూమర్లో నిజమే లేదా..!?

మన టాలీవుడ్ సినిమా దగ్గర చాలా మంది స్టార్ హీరోస్ తరహాలోనే హీరోయిన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న టాప్ హీరోయిన్ ఎవరు అంటే అది డెఫినెట్ గా అనుష్క శెట్టి అనే చెప్పొచ్చు. అయితే అనుష్క హీరోయిన్ గా నటించిన అవైటెడ్ చిత్రం “ఘాటీ” కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయా అని వారు ఎదురు చూస్తుంటే ఆమెపై ఓ కొత్త రూమర్ ఇపుడు మొదలైంది.

దీని ప్రకారం అనుష్క తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం ఖైదీ 2 లో ఆమె కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు అనే తెలుస్తుంది. ఇది ఒత్తి గాలి వార్త మాత్రమే అట. కాకపోతే ఇది విన్న స్వీటీ ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఘాటీ సినిమా విషయానికి వస్తే.. ఈ జూలై 11న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version