ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉండదు – సుకుమార్

ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉండదు – సుకుమార్

Published on Jan 3, 2014 4:15 PM IST

sukumar
‘ఆర్య’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ ఇండస్ట్రీకి పరిచయం 10 సంవత్సరాలు అయినప్పటికీ తీసింది మాత్రం కేవలం 5 సినిమాలు మాత్రమే. అందులో 2 హిట్ అయితే 2 ఫట్ అన్నాయి. ఇక ఆయన చేసిన ఐదవ సినిమా ‘1-నేనొక్కడినే’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

డైరెక్టర్ సుకుమార్ సినిమాలు సినిమాలు నిదానంగా చేస్తాడు అనడంతో పాటు ఆయన ప్రతి సినిమాలోనూ హీరో పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ‘1’ సినిమాలో మహేష్ బాబు పాత్ర కూడా నెగటివ్ గా ఉంటుందా అని అడిగితే ‘1 సినిమాలో హీరో పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవు. మాములుగానే ఉంటుంది. కానీ మహేష్ మాత్రం సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని’ అన్నాడు. అలాగే మాట్లాడుతూ ‘మహేష్ బాబు రాక్ స్టార్ లుక్ కోసం కాస్త వర్కౌట్ చేసాడు. మేము రాక్ స్టార్ గా ఎలా కనిపించాలనుకున్నామో దానికంటే అద్భుతమైన లుక్ లో ఆయన కనిపించారని’ అన్నాడు.

కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు