బాహుబలిలో ఫారన్ నటులు లేరన్న రాజమౌళి

బాహుబలిలో ఫారన్ నటులు లేరన్న రాజమౌళి

Published on Jul 14, 2013 4:05 AM IST

SS-RAJAMOULI

ప్రభాస్, అనుష్క మరియు రానా నటిస్తూ ఎస్.ఎస్ రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ సినిమాపై వస్తున్న పుకార్లకు అంతే లేకుండాపోయింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో షికారు చేస్తున్న పుకారు ఏంటంటే ఈ సినిమాలో విలన్ల విభాగంలో హాలీవుడ్ కు చెందిన ఒక నటుడ్ని ఎంపిక చేసుకున్నాడని తెగ వార్తలు వినిపించాయి. కొన్ని మీడియా సంస్థలైతే మరో అడుగు ముందుకేసి ఆ విలన్ ‘ట్రాయ్’ సినిమాలో నటించిన నాథన్ జోన్స్ అని కధనాలు ప్రచురించాయి. వీటన్నిటికీ రాజమౌళి స్పందిస్తూ “‘బాహుబలి’ సినిమా కోసం ఏ హాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకోలేదు. మరోసారి తప్పుడు వార్త” అని చెప్పాడు

ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే కర్నూల్ లో మొదలైంది. మొదటిరోజే షూటింగ్ ను చూడడానికి కొన్ని వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ విషయం గురించి రాజమౌళి మాట్లాడుతూ “కర్నూల్ ప్రజలకు ధన్యవాదాలు . లెక్కలేనన్ని సంఖ్యలో ప్రేక్షకులు హాజరైనా ప్రశాంతంగా షూటింగ్ జరిగినందుకు చాలా సంతోషం, కానీ వర్షం మనకు సహకరించడం లేదు ..:) ఇంతకంటే పెద్దదైన, భారీ షెడ్యూల్ కు సిద్ధమవుతున్నాం”అని తెలిపాడు. మొదటి షెడ్యూల్ ముగిసిన ఈ సినిమా త్వరలో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. ప్రస్తుతం అమెరికాలో వున్న రాజమౌళి తిరిగి రాగానే హైదరాబాద్ లో షూటింగ్ మొదలవుతుంది. ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు