కెమిస్ట్రీలో డబుల్ మీనింగ్ ఉండదంటున్న నిర్మాత

కెమిస్ట్రీలో డబుల్ మీనింగ్ ఉండదంటున్న నిర్మాత

Published on May 19, 2013 12:00 PM IST

Chemistry
శ్రీ రాం కొడాలి, అమితారావ్ హీరో హీరోయిన్స్ గా వాచెస్పతి దర్సకత్వం లో వివిడ్ జర్నీ బ్యానర్ పై వస్తున్న చిత్రం “కెమిస్ట్రీ – మనసుకీ మనసుకీ మధ్య”. ఈ సినిమా మే 24న విడుదల కానుంది.

దర్శకుడు మాట్లాడుతూ ‘నన్ను అందరు అడుగుతున్నారు కెమిస్ట్రీ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుంది? అని.. రెండు హృదయాల మధ్యన ఉండే ప్రేమే కెమిస్ట్రీ. ప్రేమకి వయసుతో సంభందం లేదు. అందుకే ఈ కెమిస్ట్రీ సినిమా అన్ని వయసుల వారికి సంబందించిన ఫ్యామిలీ మూవీ అని చెబుతున్నామని’ అన్నాడు.

నిర్మాత జి .శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా చూసిన తర్వాత యువకులు, మధ్య వయసు వారు జీవితంలో తన భాగస్వామితో జరిగిన తీపి గుర్తులను గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్న సినిమా అంటే డబుల్ మీనింగ్ అనే భ్రమలో ఉన్నారు. మా కెమిస్ట్రీ ఉండదు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ చూడదగ్గ సినిమా’ అని అన్నారు .

తాజా వార్తలు