అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. మరి ‘పుష్ప’ సినిమాతో మరో భారీ హిట్ కొడతారా చూడాలి. అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ వేశారాట. కరోనా తరువాత కూడా బడ్జెట్ లో మార్పు లేదట. ఇక ఆగస్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే సాంగ్స్ కి ఎక్కువ మంది డాన్సర్స్ కావాల్సి రావడం, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడంతో ముందుగా సాంగ్స్ కంటే కూడా.. తక్కువమంది ఆర్టిస్ట్ లు ఉన్న సీన్స్ నే షూట్ చేయాలనుకుంటున్నారు దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.