నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ వాయిదా పడట్లేదు

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ వాయిదా పడట్లేదు

Published on Mar 2, 2020 8:00 PM IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. కానీ గత రెండు రోజులుగా సినిమా వాయదాపడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని, చిత్రాన్ని ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఇందులో చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ప్రారంభం రోజు నుండే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ మొదలుకాగా ఇటీవల విడుదలైన ‘ఏ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ ఆ బజ్ ను మరింత పెంచింది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు