ప్రభాస్ తగ్గినా విజయ్ తగ్గలేదు.. క్లాష్ కి రెడీ!

Jana-Nayagan-Raaja-saabjpg

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీతో చేస్తున్న అవైటెడ్ సినిమానే ది రాజా సాబ్. ఒక హారర్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో జనవరి 9న విడుదల చేస్తున్నట్టుగా ఇది వరకే కన్ఫర్మ్ చేశారు. కానీ తమిళ్ వెర్షన్ లో మాత్రం ఒకరోజు తర్వాత అంటే జనవరి 10కి మేకర్స్ ఫిక్స్ చేశారు.

అయితే అదే డేట్ లో విజయ్ నటిస్తున్న జన నాయకుడు సినిమా ఉండడంతో తమిళ్ లో క్లాష్ వద్దనుకుని మరో రోజుకి షిఫ్ట్ చేశారు. అయితే తెలుగు నుంచి మేకర్స్ ఈ స్టెప్ తీసుకున్నారు కానీ జన నాయకుడు కూడా వీరు చేసినట్టే తెలుగులో ఒక రోజు గ్యాప్ తో వస్తాడేమో అనుకున్నారు కానీ ఆ సినిమా మేకర్స్ మాత్రం ఇందులో వెనక్కి తగ్గలేదు.

వీరి సినిమా తెలుగులో సహా తమిళ్ కూడా జనవరి 9నే వస్తున్నట్టుగా లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. సో తెలుగు రిలీజ్ తో రాజా సాబ్ కి కొన్ని థియేటర్స్ అయినా తెలుగు స్టేట్స్ లో ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పాలి. మరి దీనిపై ఫ్యూచర్ లో ఏమన్నా డేట్ మారుతుందేమో చూడాలి.

Exit mobile version