హిందీలోకి నిత్యామీనన్ – శ్రీ ప్రియల సినిమా ?

హిందీలోకి నిత్యామీనన్ – శ్రీ ప్రియల సినిమా ?

Published on Jul 10, 2013 10:00 PM IST

Nithya-Menon-and-Sri-Priya
నిత్యామీనన్ నటిస్తున్న ద్విభాషా చిత్రం హిందీలోకి రీ-మేడ్ కానుంది. చాలాకాలం విరామం తరువాత గతంలో నటి అయిన శ్రీ ప్రియ దర్శకత్వంలో ఆమె సినిమాను అంగీకరించింది. ‘మాలిని 22 పాలయంకొట్టై’ అని తమిళ వెర్షన్ టైటిల్. తెలుగులో పేరును ఖరారు చెయ్యవలిసివుంది. ఈ చిత్రం మలయాళంలో రీమా కల్లింగల్, ఫహాద్ నటించిన ’22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాకు రీమేక్. ప్రస్తుతం ఈ తమిళ రీమేక్ లో రీమా పాత్రను నిత్య, ఫహాద్ పాత్రను నిత్య, ఫహాద్ పాత్రను తమిళ నటుడు క్రిష్ పోషిస్తున్నారు. ప్రధాన తారాగణాన్ని ఈమధ్యే చెన్నైలో ప్రకటించిన శ్రీ ప్రియ తాను ఈ సినిమాను హిందీలో కూడా చేసే ఆలోచన వున్నట్లు తెలిపింది. ఇదే కనుక జరిగితే నిత్యామీనన్ కు ఈ చిత్రం బాలీవుడ్ లో మొదటి సినిమా అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అత్యాచారానికి గురైన పాత్ర చుట్టూ ఈ చిత్ర కధ తిరుగుతుంది.

తాజా వార్తలు