నిత్య మీనన్ తన రాబోయే కన్నడ చిత్రం “మైనా”లో వికలాంగురాలి పాత్రలో కనిపించబోతున్నారు. చేతన్ మరియు శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగశేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకానొక పత్రికతో మాట్లాడుతూ నాగశేకర్ ఇలా అన్నారు “ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు నిత్య మాత్రమే పోషించగలదు అందుకే ఈ పాత్రకు నిత్యను ఎన్నుకున్నాం”. గతంలో 7’O క్లాక్ మరియు జోష్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు చేసిన నిత్యాకు ఇదే మొదటి పూర్తి కన్నడ చిత్రం.
ఈ చిత్రం నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీస్తున్న చిత్రం. తను ప్రేమించిన అమ్మాయి కోసం 35 మందిని చంపిన ఒక అబ్బాయి కథ. చెన్నైలో జరిగిన ఈ సంఘటన కన్నడలో చిత్రీకరించటం ఆసక్తి కరం. గతంలో నిత్య యువరాణి,పాత్రికేయురాలు వంటి ఛాలెంజింగ్ పాత్రలు పోషించారు. కాని ఇలా వికలాంగురాలి పాత్రలో నటించటం ఇదే తొలిసారి. ప్రస్తుతం తెలుగులో నారా రోహిత్ సరసన “ఒక్కడినే” చిత్రంలో నిత్య నటిస్తున్నారు.