జూలై 30న.. నితిన్ ‘రంగ్ దే’ ?

జూలై 30న.. నితిన్ ‘రంగ్ దే’ ?

Published on Mar 11, 2020 2:35 PM IST

హీరో నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్ ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమా ‘రంగ్ దే’ చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ తన పూర్తి సమయాన్ని ఈ సినిమా కోసమే కేటాయించారు. దీంతో చిత్రీకరణ స్పీడ్ అందుకుంది. కాగా ఇప్పటికే సగం షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం పూర్తిస్థాయి ప్రేమ కథగా ఉండనుంది. ఇందులో నితిన్ సరసన స్టార్ నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక రంగ్‌దే’ సినిమాతో పాటు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే సినిమా కూడా నితిన్ చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న ‘పవర్‌ పేట’ పెద్ద స్పాన్‌ ఉన్న కథ.. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, అలాగే 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల ముసలాడిగా కూడా నితిన్ కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు