ఈ నెలలో ప్రారంభంకానున్న నితిన్ కొత్త సినిమా

Nithin1
ప్రస్తుతం వున్న యువకధానాయకులలో నితిన్ చాలా వేగంగా కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి. సమీక్షలను పక్కనబెడితే ఈ హార్ట్ ఎటాక్ సినిమా కాసులు బాగానే వసూలు చేసింది. ప్రేక్షకుల స్పందన చూసి సినిమా బృందం ఆనందంగా వున్నారు.

నితిన్ తదుపరి సినిమా ఈ నెల 24న మొదలుకానుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి శ్రేష్ట్ మూవీస్ ను స్వర్ణా మూవీస్ గా మారుస్తున్నట్లు ప్రకటించాడు. సుర్రెందర్ రెడ్డి శిష్యుడు శ్రీనివాస్ దర్శకుడు. మనం సినిమాకు మాటలు రాస్తున్న హర్షవర్ధన్ కు మరోసారి ఆ పనే ఈ సినిమాకు ఇచ్చారు. ముకుంద్ పాండే స్క్రీన్ ప్లే చూస్కొనున్నాడు. దిల్ సినిమాలా ఇది ఒక కమర్షియల్ చిత్రం అవ్వనుంది అని నితిన్ తెలిపాడు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు అధికారికంగా తెలుపనున్నారు. ఈ సినిమా కాక నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ మరియు కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.

Exit mobile version