మూడవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నితిన్ చిత్రం

మూడవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నితిన్ చిత్రం

Published on Dec 19, 2012 10:16 PM IST

Gundeljari-Gallanthayyindhe
నితిన్ రాబోతున్న చిత్రం “గుండె జారి గల్లంతయ్యిందే” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నితిన్, నిత్య మీనన్ మరియు ఇషా తల్వార్ లు ఈ త్రికోణ ప్రేమకథలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర మూడవ షెడ్యూల్ పూర్తయ్యింది, ప్రధాన పాత్రల నడుమ కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు. దాదాపుగా 75% టాకీ పూర్తయ్యింది. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నారు ఇదే అతని తొలి చిత్రం. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నితిన్ మరియు నిత్యలు కలిసి నటించిన “ఇష్క్” చిత్రం ఎంత విజయం సాదించిందో తెలిసిందే. ఇది కాకుండా నితిన్ ప్రేమ సాయి దర్శకత్వంలో “కొరియర్ బాయ్ కళ్యాణ్” చిత్రంలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు