నితిన్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన పూరి జగన్నాధ్

Heart-Attack_Nithiin-Puri-
యంగ్ హీరో నితిన్ ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి రెండు సినిమాలు మల్టీ ప్లెక్స్, క్లాస్ ఆడియన్స్ ని మెప్పిస్తే ‘హార్ట్ ఎటాక్’ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ విషయంలో నితిన్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు.

ఇటీవలే జరిగిన ‘హార్ట్ ఎటాక్’ ప్లాటినం డిస్క్ వేడుకలో కూడా నితిన్ మాట్లాడుతూ ‘నా చివరి రెండు విజయాలు ఏ,బి సెంటర్స్ లో మాత్రమే ఆడాయి. కానీ హార్ట్ ఎటాక్ మాత్రం సి సెంటర్స్ లో కూడా ఆడుతోంది. మాస్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాతో నా మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టినందుకు పూరి గారికి థాంక్స్’ అని అన్నాడు. పూరి తన సొంత నిర్మాణంలో నిర్మించిన ఈ సినిమాలో ఆద శర్మ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version