మరోసారి పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని చాటుకున్న నితిన్

మరోసారి పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని చాటుకున్న నితిన్

Published on Sep 18, 2012 7:29 PM IST

హీరో నితిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయనకీ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాలలో తెలిపారు కూడా. ఈ ఏడాది మొదట్లో నితిన్ మరియు నిత్య మీనన్ ప్రధాన పాత్రలలో వచ్చిన “ఇష్క్” చిత్ర ఆడియో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల అయ్యింది. తరువాత ఆ చిత్రం భారీ విజయం సాదించడం జరిగింది. ప్రస్తుతం నితిన్ “కొరియర్ బాయ్ కళ్యాణ్” అనే చిత్రం చేస్తున్నారు. ఇది కాకుండా మరొక చిత్రం చేస్తున్నారు ఆసక్తికరంగా ఈ చిత్రానికి “గుండెజారి గల్లంతయ్యిందే” అనే పేరు పెట్టారు. ఈ పేరు పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంలో “దిల్ సే” పాటలో వచ్చే ఒక వాక్యం. ఈ చిత్రంలో నితిన్,నిత్య మరియు ఇషా తల్వార్ ఈ రొమాంటిక్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం రేపు వినాయక చవితి సందర్భంగా మొదలు కానుంది.

తాజా వార్తలు