కొరియర్ బాయ్ కళ్యాణ్ కి మొదలైన డబ్బింగ్

కొరియర్ బాయ్ కళ్యాణ్ కి మొదలైన డబ్బింగ్

Published on Aug 26, 2013 12:50 PM IST

Nithin1

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరసగా హిట్స్ అందుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ రోజు ఉదయం శబ్దాలయా స్టూడియోలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. డబ్బింగ్ మొదలు పెట్టిన సందర్భంగా నితిన్ కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ సినిమాలో నితిన్ సరసన యామీ గౌతం హీరోయిన్ గా కనిపించనుంది.

ప్రేమ్ సాయి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఫేమస్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా స్టొరీ లైన్ చాలా కొత్తగా ఉంటుందని, కచ్చితంగా బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధిస్తుందని నితిన్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నితిన్ ఈ సినిమా కాకుండా త్వరలోనే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘హార్ట్ అటాక్’ సినిమా చేయనున్నాడు. ఈ నెలాఖరు నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయనున్నాడు.

తాజా వార్తలు