తన డైరెక్టర్ కు నితిన్ కాస్ట్లీ గిఫ్ట్.!

తన డైరెక్టర్ కు నితిన్ కాస్ట్లీ గిఫ్ట్.!

Published on Sep 9, 2020 8:07 AM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ కెరీర్ లో కూడా ఎన్నో ఘోరమైన ప్లాపులు పడ్డాయి. అది కూడా వరుసగా వస్తున్నప్పటికీ కూడా పడిలేచే కెరటంలానే ముందుకు దూసుకువస్తూనే నిలబడగలిగాడు. అలా తన కెరీర్ బాగా డౌన్ గా ఉన్న సందర్భంలో “ఇష్క్” సినిమాతో మంచి హిట్ కొట్టాడు.

ఆ తర్వాత కూడా మరో హిట్ అందుకున్నాక మళ్ళీ కెరీర్ డౌన్ అయ్యింది. ఇక ఆ సమయంలో సరైన హిట్ పడాలని నితిన్ అభిమానులు అనుకుంటున్న సమయంలో మొదలు పెట్టిన చిత్రం “భీష్మ”. ఓ రకంగా ఈ చిత్రాన్ని నితిన్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా అని కూడా చెప్పొచ్చు.

అలా చాలా కాలం విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రం నితిన్ కు మంచి సాలిడ్ కం బ్యాక్ లా నిలిచింది. తనకు అలాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు వెంకీ కుడుముల కు నిన్న పుట్టినరోజు సందర్భంగా నితిన్ ఒక కాస్ట్లీ రేంజరోవర్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో వెంకీ ఆనందం వ్యక్తం చేసారు. నితిన్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఫోటోను వెంకీ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

తాజా వార్తలు